రామాయంపేట, నవంబర్ 10: అప్పుల బాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్‌లో ఆదివారం రాత్రి చోటుచేసుకున్నది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వడ్డె పెద్ద రమేశ్ (45)కు రెండు ఎకరాల పొలం ఉన్నది. అందులో వరి సాగు చేస్తున్నాడు. సరైన దిగుబడులు లేకపోవడంతోపాటు ఇద్దరు పిల్లల పెళ్లిళ్లకు అప్పు చేశాడు. వాటిని తీర్చే మార్గం లేక బావి దగ్గర ఉన్న చెట్టుకు లుంగీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.