మనస్తాపంతో రైతు ఆత్మహత్యాయత్నం
పోడు భూమిలో ఫారెస్టు అధికారులు కందకాలు తీస్తుండటంతో మనస్తాపంచెందిన రైతు ఆత్మహత్యకు యత్నించిన ఘటన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో సోమవారం చోటుచేసుకున్నది.
- పోడుభూమిలో కందకాలు పురుగుల మందు తాగిన మహేందర్
- ప్రాణాపాయ స్థితిలో ములుగులోచికిత్స
ములుగు, జూలై 20 (నమస్తేతెలంగాణ) : పోడు భూమిలో ఫారెస్టు అధికారులు కందకాలు తీస్తుండటంతో మనస్తాపంచెందిన రైతు ఆత్మహత్యకు యత్నించిన ఘటన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో సోమవారం చోటుచేసుకున్నది. బాధిత పోడురైతు బోడ మహేందర్ భార్య రమ తెలిపిన వివరాల ప్రకారం.. బోడ మహేందర్ 12 ఏండ్లుగా పాలంపేట శివారులోని రామప్ప సరస్సును ఆనుకొని ఉన్న భూమిలో పోడు వ్యవసాయం చేస్తున్నాడు. ఇటీవల కొందరు కాంగ్రెస్ నాయకులు 20 రోజుల నుంచి ఇబ్బందులకు గురిచేస్తూ ఫారెస్టు అధికారులతో దాడులు చేయిస్తున్నారు. దీంతో మనస్తాపం చెందిన మహేందర్ సెల్ఫీ వీడియో తీసి అధికారుల ఎదుటే పురుగు మందు తాగాడు. సాగు చేసుకుంటున్న భూమిలో ట్రెంచ్ వేస్తే పొలంలోనే మందుతాగి చచ్చిపోతానని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. ఈ భూమినే జీవనాధారమని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం మహేందర్ ములుగు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

