తుంగతుర్తి, మే 21 : కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసి నెల దాటుతున్నా, కాంటా వేయకపోవడంతో విసుగెత్తిన ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. తోటి రైతులు గమనించి పెట్రోల్ బాటిల్ లాక్కొవడంతో ప్రమాదం తప్పింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంఅన్నారం గ్రామానికి చెందిన రైతు ఉప్పల వెంకన్న ఐకేపీ కేంద్రంలో ధాన్యం పోశాడు.
30 రోజులు దాటుతున్నా ఐకేపీ సెంటర్ నిర్వాహకులు ధాన్యం కాంటా వేయలేదు. వానలు పడినప్పుడల్లా తిరిగి ఆరబెట్టాల్సి వస్తున్నది. దీంతో రైతు వెంకన్న ధాన్యం రాశి వద్దే పెట్రోల్ మీద పోసుకొని అంటించుకునే ప్రయత్నం చేశాడు. పక్కనున్న రైతులు గమనించి పెట్రోల్ బాటిల్ లాక్కొని నచ్చజెప్పడంతో ప్రమాదం తప్పింది.