కరీంనగర్ కమాన్‌చౌరస్తా, అక్టోబర్ 25 : ప్రముఖ పద్యకవి, కీర్తి పురసార గ్రహీత జీవీ కృష్ణమూర్తి (75) బుధవారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కరీంనగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. పెద్దపల్లి అదనపు కలెక్టర్ జీవీ శ్యామ్‌ప్రసాద్‌లాల్, జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు గాజుల రవీందర్, డాక్టర్ గండ్ర లక్ష్మణారావు, డాక్టర్ తత్వాది ప్రమోద్‌కుమార్, రామక విఠలశర్మ, సాహితీ గౌతమి ప్రధాన కార్యదర్శి నంది శ్రీనివాస్, డాక్టర్ వారాల ఆనంద్, డాక్టర్ నలిమెల భాసర్, అన్నవరం దేవేందర్, బొద్దుల లక్ష్మయ్య, సముద్రాల వేణుగోపాల ఆచార్య, డాక్టర్ బీవీఎన్ స్వామి, గాజోజ నాగభూషణం, కేఎస్ నంతాచార్య, మాడిశెట్టి గోపాల్, దబ్బెట రాజా రామ్మోహన్ శర్మ, కేబీ శర్మ తదితరులు జీవీ కృష్ణమూర్తి భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. సాయంత్రం జీవీ కృష్ణమూర్తి అంత్యక్రియలు పూర్తిచేశారు.