అందోల్/రామచంద్రాపురం, డిసెంబర్ 3: ఆర్థిక ఇబ్బందులు, కలహాలు.. ఓ కుటుంబాన్ని బలితీసుకొన్నాయి. భర్త ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోగా, పిల్లలతో కలిసి చెరువులో దూకి భార్య బలవన్మరణానికి ఒడిగట్టిం ది. సంగారెడ్డి జిల్లాలోని వేర్వేరు ప్రాం తాల్లో జరిగిన ఈ ఘటనలు శుక్రవారం కలకలం రేపాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మునిపల్లి మం డలం గార్లపల్లికి చెందిన నాగేశ్వర్రావు బీహెచ్ఈఎల్ విశ్రాంత ఉద్యోగి. బీహెచ్ఈఎల్ లోని ఎంఐజీ ఫేజ్-2 విద్యుత్‌నగర్‌లో స్థిరపడ్డారు. ఈయనకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు అమెరికాలో స్థిరపడ్డాడు. చిన్నకొడుకు చంద్రకాంత్‌రావు (35) టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూనే స్థిరాస్తి వ్యాపా రం నిర్వహిస్తున్నారు. చంద్రకాంత్‌కు భార్య లావణ్య (33), కొడుకు ప్రతమ్ (9), కూతురు సర్పజ్ఞ (1) ఉన్నారు. స్థిరాస్తి వ్యాపారంలో నష్టాలు రావడంతో అప్పులు పెరిగాయి. ఈ విషయమై దంపతుల మధ్య తరుచూ గొడవలు జరిగేవి. అప్పులు తీర్చేందుకు గ్రామంలో ఉన్న పొలం అమ్మాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు తండ్రి నాగేశ్వర్రావు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం కూడా గొడవ జరగడంతో పిల్లలను తీసుకొని లావణ్య ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. మరింత వేదనకు గురైన చంద్రకాంత్.. బెడ్రూంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. భర్త మృతిచెందిన విషయం తెలిసిన లావణ్య తీవ్ర మనస్తాపంతో అందోల్ చెరువులో ఇద్దరు పిల్లలతో కలిసి దూకి బలవన్మరణానికి పాల్పడింది. శుక్రవారం ఉదయం నీటిపై తేలిన మృతదేహాలను చూసి స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఘటనాస్థలికి చేరుకొన్న పోలీసులు వారిని గుర్తించి, కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. లావణ్య సోదరి సౌజన్య ఫిర్యాదు మేరకు రెండు చోట్లా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.