హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో అరెస్టయిన ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నూనె శ్రీధర్ నుంచి శనివారం రెండోరోజు విచారణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు పలు వివరాలను రాబట్టినట్టు తెలిసింది.
శుక్రవారం తొలి రోజు విచారణలో శ్రీధర్ వ్యక్తిగత వివరాలు, కుటుంబ నేపథ్యం, వారసత్వంగా వచ్చిన ఆస్తుల గురించి తెలుసుకున్న అధికారులు.. ఆ సమాచారం ఆధారంగా రెండో రోజు బినామీల వివరాలను రాబట్టినట్టు తెలిసింది. శ్రీధర్ కుటుంబసభ్యులు బినామీలుగా ఉన్నట్టు తేలడంతో వారిని ప్రశ్నించనున్నట్టు సమాచారం. కాగా, బ్యాంకు లాకర్లను తెరిచి, దాదాపు రూ.5 కోట్లకుపైగా నగదును గుర్తించినట్టు తెలుస్తున్నది.