హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): టీ హబ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టార్టప్‌లకు అమెరికాలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు వీలుగా ఫాల్కన్ఎక్స్ యాక్సిలరేటర్‌ను ఏర్పాటు చేశారు. అమెరికాకు చెందిన ఫాల్కన్ఎక్స్ కంపెనీ టీ హబ్‌తో కలిసి ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసింది. ఈ వేదిక ద్వారా రెండు దేశాల్లో ఉన్న స్టార్టప్‌లు మార్కెట్లోకి సులభంగా ప్రవేశించేందుకు అవసరమైన సహాయసహకారాలను అందిస్తారు. ఫాల్కన్ఎక్స్ యాక్సిలరేటర్ మెంబర్షిప్ తీసుకొంటే స్టార్టప్‌లకు.. మెంటార్షిప్, పరిశ్రమలతో అనుసంధానం, పెట్టుబడిదారులతో సమావేశం అయ్యేందుకు అవకాశం కల్పిస్తారు. వివరాలకు https://bit.ly/3uMf8Jf లింకును సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు.