ఇది అబద్ధం: ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్’ ప్రాజెక్టు విలువ రూ.1200 కోట్లు. ఒక కంపెనీకి లబ్ధి చేకూర్చేందుకు కనీసం 15 ఏండ్ల అనుభవం, కనీసం 35 శాతం మార్కెట్ షేర్ ఉండాలనే నిబంధన విధించారు. న్యూట్రిషనల్ పౌడర్ ప్రమాణాలతోపాటు స్పెసిఫికేషన్లు ఒక కంపెనీకి అనుకూలంగా మార్చారు.
ఇదీ నిజం:‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ప్రాజెక్టు విలువ కేవలం రూ.50 కోట్లే. ప్రభుత్వం 2.50 లక్షల కిట్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఒక్కో కిట్ అంచనా విలువ రూ.1,962. ఈ లెక్కన 2.50 లక్షల కిట్లకు రూ.50 కోట్లకు మించి ఖర్చు కాదు. 15 ఏండ్ల అనుభవం అబద్ధం. ఐదేండ్ల అనుభవం, 25 శాతం మార్కెట్ షేర్ ఉన్న కంపెనీ టెండర్ దాఖలు చేయవచ్చని నిబంధనల్లో స్పష్టంగా ఉన్నది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగానే న్యూట్రిషన్ పౌడర్ ప్రమాణాలు నిర్దేశించాం’ అని తెలంగాణ రాష్ట్ర వైద్య మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ స్పష్టంచేశారు.