హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో చండీయాగం నిర్వహిస్తున్నారంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని కేసీఆర్ కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది.
కనీస సమాచారం తెలుసుకోకుండా, వాస్తవాలను నిర్ధారించుకోకుండా ప్రముఖ చానళ్లు కూడా వార్తలు ప్రసారం చేయడం దుర్మార్గమని మండిపడింది. తప్పుడు సమాచారాన్ని తక్షణమే తొలగించాలని, కేసీఆర్, బీఆర్ఎస్ కార్యాలయాల నుంచి అధికారికంగా వచ్చిన సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.