కూసుమంచి, ఆగస్టు 6 : బర్త్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటే డెత్ సర్టిఫికెట్ చేతిలో పెట్టి పంపించిన ఘట న ఖమ్మం జిల్లా కూసుమంచి తహసీల్ కార్యాలయంలో ఆలస్యంగా వెలుగులో కి వచ్చింది. గట్టుసింగారం గ్రామానికి చెందిన కడారి మాద విద్య బర్త్ సర్టిఫికె ట్ కోసం తల్లిదండ్రులు నేలకొండపల్లి ట్రెజరీలో 2024 డిసెంబర్ 17న చలా నా కట్టి కూసుమంచి తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు.
ఈ నెల 4న బాలిక తల్లి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి అడిగితే.. ఓ సర్టిఫికెట్ చేతిలో పెట్టారు. ఫొటో తీసుకున్న తర్వా త పరిశీలించగా.. అది డెత్ సర్టిఫికెట్ కావడంతో అవాక్కైన తల్లి సంబంధిత సెక్షన్ అధికారిని అడుగగా.. దానిని వెం టనే చించి పారేశారు. అనంతరం ఆమె కు బర్త్ సర్టిఫికెట్ క్షణాల్లో తయారు చేసి ఇచ్చారు.
ఆన్లైన్ కోసం గట్టుసింగారం పంచాయతీ కార్యదర్శి వద్దకు వెళితే.. అందులో పాప జన్మించిన దవాఖాన పేరు లేదని, తిరిగి తహసీల్దార్ కార్యాలయానికి పంపించారు. సర్టిఫికెట్ జారీ చేసిన ఉద్యోగి వద్దకు వచ్చి ఇందులో పూర్తి వివరాలు లేవని తెలుపగా ఆగ్రహించిన సదరు ఉద్యోగి ‘మీకు సర్టిఫికెట్ ఇవ్వడమే కష్టం. ఇవ్వను పో’ అంటూ సమాధానం ఇచ్చాడు. సెక్షన్ ఉద్యోగి నిర్వాహకాన్ని తహసీల్దార్ రవికుమార్ దృష్టికి బాలిక తల్లి తీసుకెళ్లగా గురువారం కార్యాలయానికి వస్తే సర్టిఫికెట్ ఇస్తామని చెప్పి పంపించారు.