హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): యూజీసీ నిబంధనల ప్రకారం పే స్కేళ్లు అమలు చేయాలని, బేసిక్, డీఏ, హెచ్ఆర్ఏ, 3 శాతం వార్షిక పెం పుతో ఉద్యోగ భద్రత కల్పించాలని, వర్సిటీల్లో సహాయ అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలని యూనివర్సిటీల్లోని కాంట్రాక్టు అధ్యాపకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అన్ని యూనివర్సిటీలు, పీజీ కాలేజీల పరిపాలన విభాగాల్లో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న వారు శుక్రవారం మూకుమ్మడిగా రాజీనామా లు చేశారు.
12 వర్సిటీల్లో శుక్రవారం నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఉద్యోగ భద్రత కల్పించిన తర్వాతనే రెగ్యులర్ పోస్టులు భర్తీ చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని వైస్ చాన్స్లర్లను డిమాండ్ చేశారు.