హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో 2024వ సంవత్సరం చరిత్రలోనే తొలి ఐదు అత్యంత తీవ్ర ఉష్ణ సంవత్సరాల్లో ఒకటిగా నిలువనున్నది. ఏప్రిల్ ముందస్తు రుతు పవనాల జల్లులు, ఉరుములతో కూడిన వర్షాలు లేకపోవడంతో భారత దక్షిణ ద్వీపకల్పంలో 1901 తరవాత ఐదో అత్యంత తకువ వర్షపాతం నమోదైంది. సూపర్ ఎల్‌నినో ప్రభావంతో 2023 జూన్ నుంచి 10 నెలలుగా ప్రతినెలా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తన అధ్యయనంలో తేలినట్టు అమెరికాకు చెందిన కె్లైమేట్ సెంట్రల్ సంస్థ తాజాగా వెల్లడించింది. ఏప్రిల్ మాసం అత్యంత వేడి మాసంగా రికార్డులకు ఎకిందని చెప్పింది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అభ్యర్థుల ప్రచారం, ఓటింగ్‌పై వాతావరణ మార్పుల ప్రభావం ఉందని తెలిపింది.
ప్రపంచంలో సగం జనాభా దేశాల్లో ఈ ఏడాదిలో ఎన్నికలు
ఈ సంవత్సరంలో ప్రపంచంలోని 49 శాతం జనాభా గల 64 దేశాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా 90 కోట్ల మందికి పైగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.