హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ) : జర్నలిస్టుల బస్‌పాస్ గడువును మరోసారి పొడిగించారు. కొత్త అక్రిడిటేషన్ కార్డులు మంజూరు కాని రాష్ట్ర, జిల్లా స్థాయి జర్నలిస్టుల బస్‌పాస్‌ను మరో 12 రోజులు పొడిగిస్తున్నట్టు రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ డాక్టర్ జీ ముకుందరెడ్డి గురువారం తెలిపారు. ఈనెల 23 నుంచి ఆగస్టు 3వతేదీ వరకు పాత అక్రిడిటేషన్ కార్డుపైనే బస్‌పాస్‌లను రెన్యువల్ చేస్తున్నట్టు తెలిపారు.