హైదరాబాద్, సెప్టెంబర్20 (నమస్తే తెలంగాణ): మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ మహిళా డిగ్రీ వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ హానర్స్ కోర్సు ఫస్టియర్ ప్రవేశాలకు విధించిన గడువును అక్టోబర్ 10 వరకు పొడిగించారు. ఎంజేపీ కార్యదర్శి బడుగు సైదులు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ఈఏపీసెట్-2024ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థినులు ఆన్లైన్ https:// mjptbcwreis.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ర్యాంకు, రిజర్వేషన్ ప్రాతిపదికన ఎంపిక ఉంటుందని వెల్లడించారు. వివరాలకు 040-23328266 ఫోన్ నెంబర్లో సంప్రదించాలని సూచించారు.