హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల గడువును ప్రభుత్వం ఆరోసారి పొడిగించింది. డిసెంబర్ 31వ తేదీ వరకు గడువును పొడిగిస్తూ శుక్రవారం సాయంత్రం సమాచార పౌరసంబంధాల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కొత్త అక్రెడిటేషన్ కార్డుల జారీ జరగలేదు. గత 22 నెలలుగా అక్రెడేషన్ కార్డుల కాల పరిమితిని ప్రభుత్వం మూడు నెలలకోసారి పొడిగిస్తూ వస్తున్నది.
టీజీహెచ్ఎంయూ నూతన కార్యవర్గం
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం(టీజీహెచ్ఎంయూ)నూతన కార్యవర్గాన్ని శుక్రవారం హైదరాబాద్‌లో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎండీ నజీముద్దీన్, ప్రధాన కార్యదర్శిగా కాట్రగడ్డ చంద్రశేఖర్, అసోసియేట్ అధ్యక్షుడిగా కే మధుసూదన్‌రెడ్డి, కోశాధికారిగా పీ వెంకటేశ్, ఉపాధ్యక్షులుగా జాక వెంకటేశ్, మాధవరెడ్డి, బుద్ధదేవ్, అంజయ్య, సంయుక్త కార్యదర్శులుగా శ్రీనునాయక్, పీ శ్రీధర్, మహిళా కార్యదర్శులుగా బండ మంజులారెడ్డి, వసంతలక్ష్మి, కొమ్మశెట్టి రమాదేవిలను ఎన్నుకున్నారు.