హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ) : గుర్తింపులేని మెడికల్ కాలేజీల ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు చెల్లవని శనివారం ఆయా రాష్ర్టాల హెల్త్ వర్సిటీల వైస్ఛాన్స్లర్లు, మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లకు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) ఉత్తర్వులు జారీ చేసింది.
పీజీ అధ్యాపకులు మౌలిక వసతులు, ఫ్యాకల్టీ స్ట్రెంథ్, కాలేజీకి కేటాయించిన సీట్లు కలిగి గుర్తింపు పొందిన మెడికల్ కాలేజీల నుంచి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుందని తెలిపింది. గుర్తింపులేని కాలేజీల నుంచి తీసుకున్న సర్టిఫికెట్లతో పొందిన అనుభవాన్ని పరిగణలోకి తీసుకోబోమని స్పష్టంచేసింది.