హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): పెండింగ్ ప్రాజెక్టుల టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించా రు. పెండింగ్ ప్రాజెక్టుల పురోగతిపై మంగళవారం సచివాలయంలో ఆ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతోపాటు సీతారామ, డిండి, దేవాదుల తదితర ప్రాజెక్టుల భూసేకరణను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. బునాదిగాని, ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి కాలువలు, ఇతర ప్రాజెక్టులకు పాలనాపరమైన అనుమతులు సత్వరమే తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆదిత్యానాథ్‌దాస్, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ ఈఎన్సీలు పాల్గొన్నారు.