హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): ఎక్సోసోమ్ ఆధారిత వ్యాధి నిర్ధారణ ప్రక్రియ అభివృద్ధిలో హైదరాబాద్‌కు చెందిన అంకుర సంస్థ యూఆర్ అడ్వాన్స్డ్ థెరప్యూటిక్స్ కీలక ముందడుగు వేసింది. పరిశోధన, క్లినికల్ ట్రయల్స్ కోసం రూపొందించిన కిట్లను కోరిన 5 రోజుల్లోగా వినియోగదారులకు అందించగల సామర్థ్యాన్ని సాధించింది. యూఆర్ అడ్వాన్స్ థెరప్యూటిక్స్ ఇప్పుడు ‘బయోవరం’ బ్రాండ్‌గా రూపాంతరం చెంది చౌకగా ఈ అధునాతన పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల ఖర్చు, సమ యం ఆదా కావడంతోపాటు ఫలితాల కచ్చితత్వం మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. హెచ్‌సీయూలోని లైఫ్‌సైన్సెస్ సూల్లో జరిగిన రీబ్రాండింగ్ కార్యక్రమంలో శాంతాబయోటెక్ వ్యవస్థాపకుడు వరప్రసాద్‌రెడ్డి, ‘బయోవరం’ వ్యవస్థాపకుడు జగన్మోహన్రెడ్డి, ప్రొఫెసర్ రెడ్డన్న, ‘బయోవరం’ సీవోవో రాచమల్లు అపర్ణ, లైఫ్‌సైన్స్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్‌రావు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.