Exit Polls | హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగా ణ): ఏపీలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు భిన్నంగా వచ్చాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? అన్న అంశాన్ని మాత్రం కచ్చితంగా చెప్పలేకుండాపోతున్నాయి. కొన్ని సర్వే సంస్థలు టీడీపీకి, మరికొన్ని సర్వే సంస్థలు వైసీపీకి అనుకూలంగా ఫలితాలు ఇచ్చాయి. దీంతో ఏపీలో ఏ పార్టీ అధికారం ఏర్పాటు చేస్తుంది? అన్న అంశంపై స్పష్టత రాలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పోటీ మాత్రం టీడీపీ, వైసీపీ మధ్యే ఉన్నట్టు ఎగ్జిట్ పోల్స్ చూపిస్తున్నాయి. రైజ్, జనగళం, చాణక్య స్ట్రాటజీస్, పయనీర్, పీపుల్స్ పల్స్, కేకే సర్వేస్, నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థలు టీడీపీ కూటమికి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ చూపించాయి. ఆరా, ఎస్ఏఎస్, రేస్, పోల్స్ట్రాటజీ, ఆగ్నివీర్, సీపీఎస్ వంటి పలు రకాల సర్వే సంస్థల సర్వేల్లో వైసీపీకి అనుకూలంగా వచ్చాయి. లోకసభ స్థానాల్లో మాత్రం అధిక ఏజెన్సీలు కొంత వరకు టీడీపీ కూటమికే అనుకూల ఫలితాలు చూపాయి.