Srinivas goud | హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): బీసీల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే రెచ్చగొట్టడం కాకుండా బీసీ జన గణన చేపట్టాలని, చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఎైక్సెజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రతినిధుల సభలో బీసీల తీర్మానాన్ని బలపరిచారు. అనంతరం మాట్లాడుతూ కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
బీసీల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం రూ.2 వేల కోట్లు మాత్రమే కేటాయించిందని, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం 8 ఏండ్లలో దాదా పు 1.60 లక్షల కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. బడ్జెట్లో బీసీ మంత్రిత్వ శాఖకు రూ.6,900 కోట్లు కేటాయించామని, దీనికి అదనంగా చేపలు, గొర్రెలకు నిధులు కేటాయించినట్టు చెప్పారు. తెలంగాణ తరహాలో దేశవ్యాప్తంగా బీసీ గురుకులాలు, , ఢిల్లీలో ఆత్మగౌరవ భవనాలకు స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు.