హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): ఉట్కూర్ ఎక్సైజ్ ఎస్సై బానాల మురళీకృష్ణను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి గురువారం అభినందించారు. మురళీకృష్ణ 2023లో భద్రాచలం ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తు న్న సమయంలో 28 కేజీల గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
ఆ తర్వాత చార్జిషీట్ సిద్ధం చేసి కోర్టుకు సమర్పించగా, ఇటీవల కోర్టు నిందితుడికి 3 ఏండ్ల జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా విధించింది. దీంతో కేసును పకడ్బందీగా సిద్ధం చేసిన మురళీకృష్ణకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి, జాయింట్ కమిషనర్ ఖురేషి, అసిస్టెంట్ కమిషనర్ ప్రణవి క్యాష్ అవార్డును అందజేశారు.