వీణవంక, అక్టోబర్ 2: పెం డ్లి కావడం లేద ని, సంబంధా లు కుదరడం లే దని ఎక్సైజ్ కా నిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఎలుబాకలో జరిగింది. ఎలుబాకకు చెందిన బొల్లం దే వేందర్రెడ్డి (27) నాలుగేండ్లుగా హు జూరాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో కా నిస్టేబుల్గా పనిచేస్తున్నాడు.
ఉద్యోగం వచ్చినా పెండ్లికాకపోవడం, సంబంధా లు కుదరకపోవడంతో మానసికంగా కుంగిపోయాడు. జీవితంపై విరక్తిచెంది మంగళవారం రాత్రి గడ్డిమందు తాగా డు. కుటుంబ సభ్యులు వెంటనే కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు, తర్వాత ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందాడు. కేసు దర్యాప్తులో ఉందని ఎస్సై తోట తిరుపతి తెలిపారు.