బుధవారం 03 జూన్ 2020
Telangana - May 22, 2020 , 18:26:08

పూడూరులో గుప్తనిధుల కోసం తవ్వకాలు

పూడూరులో గుప్తనిధుల కోసం తవ్వకాలు

జోగులాంబ గద్వాల : జిల్లాలోని గద్వాల మండలం పూడూరు గ్రామ సమీపంలో దుండగులు గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. గుర్తుతెలియని వ్యక్తులు గ్రామ సమీపంలోని బక్కమ్మ చెరువు దగ్గర పాత శివలింగ విగ్రహాన్ని తొలగించి గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. సమాచారం అందుకున్న రూరల్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. స్థానికులు గ్రామ సర్పంచ్‌ ఆధ్వర్యంలో శివలింగాన్ని యథాస్థానంలో ఉంచి పూజలు నిర్వహించారు.logo