హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్‌రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో సిట్ అధికారులు ఆయనను విచారిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరుకావాలంటూ సిట్ సోమవారం ఆయనకు నోటీసులు ఇచ్చింది.
దాంతో ఇవాళ సంతోష్‌రావు సిట్ అధికారుల ఎదుట విచారణకు వచ్చారు. సోమవారం సిట్ నోటీసులు అందుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను రేపు సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరవుతానని, కేసు సంబంధించి వారు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబుతానని అన్నారు.
కాగా ఇదే కేసులో గతంలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లను కూడా సిట్ విచారించింది. వారి వాంగ్మూలాలను నమోదు చేసింది.