World Environment Day | హైదరాబాద్ : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎర్రవల్లిలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ మొక్కలు నాటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా భాద్యతగా తాను మూడు మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందన్నారు సంతోష్ కుమార్. పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అని తెలిపారు. మొక్కలు నాటడమే కాదు వాటిని రక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేనలో భాగంగా మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, ప్రముఖ సినీ హీరో చిరంజీవి, పద్మశ్రీ అవార్డు గ్రహిత జాదవ్ పయాంగని మొక్కలు నాటాలని కోరారు. అనంతరం అందరికి ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Did my part today on the eve of #WorldEnvironmentDay! Planted 3 saplings for a greener planet as part of the #GreenIndiaChallenge initiative. It’s a small step, but every plant matters.
I now challenge @KTRBRS garu, @KChiruTweets garu, and @FPayeng ji to join in. Let’s keep the… pic.twitter.com/C8gqLGKPrf
— Santosh Kumar J (@SantoshKumarBRS) June 5, 2025