హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని 23వేల ప్రభుత్వ పాఠశాలలను 4వేలకు కుదిస్తామని ఇటీవల సీఎం రేవంత్రెడ్డి చేసిన ప్రకటనను విరమించుకోవాలని మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సీఎంకు బహిరంగ లేఖ రాశారు.
రేవంత్ ప్రకటన అమలైతే రాష్ట్రంలో 15 వేల గ్రామాలు స్కూళ్లు లేని ఊళ్లుగా మారిపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఆ నిర్ణయం రాజ్యాంగానికి, విద్యాహకు చట్టానికి వ్యతిరేకమని స్పష్టంచేశారు. రాష్ట్రంలోని 34 శాతం మంది పేద విద్యార్థులు 25 వేల ప్రభుత్వ పాఠశాలలపైనే ఆధారపడి ఉన్నారని తెలిపారు.