మాజీ ఎమ్మెల్యే ముత్యంరెడ్డి కన్నుమూత

సీఎంగా అంజయ్య రాకతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా
సంతాపం ప్రకటించిన సీఎం కే చంద్రశేఖర్‌రావు
హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ) /రామాయంపేట: బడుగు బలహీనవర్గాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేసిన మెదక్ జిల్లా పూర్వ రామాయంపేట మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత రాజిరెడ్డిగారి ముత్యంరెడ్డి (93) కన్నుమూశారు. కొన్నేండ్లుగా అనారోగ్యానికి గురై మంచానికే పరిమితమైన ఆయన.. హైదరాబాద్‌లోని బోయినపల్లిలో ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచా రు. సోమవారం స్వగ్రామమైన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారంలోని స్వగృహానికి ఆయన మృతదేహాన్ని తరలించారు. ఆయనకు సంతానం లేనందున ఓ పాపను దత్తత తీసుకోగా.. ఆమే ఆయనకు సపర్యలు చేసింది. ఆయనకు భార్య వెంకటాయమ్మ ఉన్నారు. సీఎం కేసీఆర్‌తో అత్యంత సన్నిహితంగా ముత్యంరెడ్డి ఉండేవారు. ము త్యంరెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతాపం తెలిపారు. సొంత జిల్లా నేతగా రాజకీయాల్లో తనతోపాటు కలి సి పనిచేసిన గతాన్ని సీఎం స్మరించుకున్నారు. మెదక్ జిల్లా ఆదర్శవంతమైన నేత ను కోల్పోయిందని, ఆయన మర ణం బాధాకరమని విచారం వ్యక్తంచేశారు. ముత్యంరెడ్డి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
టీ అంజయ్య కోసం పదవి త్యాగం
ముత్యంరెడ్డి ఎమ్మెల్యేగా తక్కువగా కాలమే పనిచేసినా రామాయంపేటలో ప్రభుత్వ కళాశాల, ప్రభుత్వ దవాఖాన, బస్టాండు నిర్మించారు. 1980లో సీఎంగా టీ అంజ య్య రావడంతో ఆయన మాట ప్రకారం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రామాయంపేట ఎమ్మెల్యేగా టీ అంజయ్య ఎన్నికై ముఖ్యమంతిగా కొనసాగారు. ముత్యంరెడ్డి 1981 నుంచి 85 వరకు జడ్పీ చైర్మన్‌గా కొనసాగారు. మెదక్ ఎల్ఎంబీ (అంజుమన్ సొసైటీ) చైర్మన్‌గా పనిచేశారు. ఎమ్మెల్సీగా కొనసాగారు. ముత్యంరెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, చిలుముల మదన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్లొళ్ల శశిధర్‌రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆర్ఎస్ వాసురెడ్డి తదితరులు సంతాపం ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- anjaiah
- KCR
- Muthyamreddy
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

