ఆదిలాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి రూ.2 లక్షల రుణమాఫీ విషయంలో రైతులను ఆందోళనకు గురిచేస్తున్నారని, ఆయనపై చట్టపరమైన చ ర్యలు తీసుకోవాలని పోలీసులకు మాజీ మం త్రి జోగు రామన్న ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డికి ఫిర్యాదు పత్రం అందజేశారు.
రుణమాఫీ విషయంలో సీఎం అబద్ధా లు ఆడుతున్నారని, రైతులను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. ‘బ్యాంకులకు వెళ్లి రూ.2 లక్షల రుణం తీసుకోండి.. మేము అధికారంలోకి రాగానే డిసెంబరు 9న మాఫీ చేస్తాం’ అని చెప్పిన రేవంత్‌రెడ్డి ఆ తరువాత మాట మార్చినట్టు ఆరోపించారు. సీఎం రే వంత్ సోమవారం ప్రధాని నరేంద్రమోదీకి రాసిన లేఖలో 7 అక్టోబర్ 2024 నాటికి రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ మూడు దశల్లో పూర్తిస్థాయిలో అమలు చేశామని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉన్నదని అన్నారు.