KCR | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి, తుంగతుర్తి, ఆలేరు మాజీ ఎమ్మెల్యేలు ఫైళ్లశేఖర్రెడ్డి, గాదరి కిశోర్, గొంగిడి సునీతామహేందర్‌రెడ్డిలు శుక్రవారం ఎర్రవెల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్.. బీఆర్ఎస్ రజతోత్సవాల నిర్వహణ, వరంగల్ బహిరంగ సభ, తదితర అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు. త్వరలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిగిలిన ఎనిమిది నియోజకవర్గాల ముఖ్యనేతలతో సమావేశం ఉంటుందని తెలిపారు.