Harish Rao | నిమ్స్‌లో మాజీ ఎంపీ మందా జగన్నాథంను పరామర్శించిన హరీశ్‌రావు
Harish Rao | నిమ్స్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథంను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పరామర్శించారు.
Harish Rao | హైదరాబాద్ : నిమ్స్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథంను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు హరీశ్‌రావు. అనంతరం జగన్నాథం ఆరోగ్య పరిస్థితి వివరాలను వైద్యులను అడిగి హరీశ్‌రావు తెలుసుకున్నారు.
మందా జగన్నాథంను పరామర్శించిన వారిలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, మాజీ మంత్రులు దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి కూడా ఉన్నారు.

రెండు రోజుల క్రితం గుండెపోటుకు గురైన జగన్నాథంను ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించిన సంగతి తెలిసిందే. 1996లో ఆయన తొలిసారిగా టీడీపీ తరఫున నాగర్‌కర్నూల్ ఎంపీగా విజయం సాధించారు. 1999, 2004లో జరిగిన ఎన్నికల్లో తెలుగు దేశం టికెట్‌పై మళ్లీ విజయం సాధించారు. ఆతర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన 2009 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. 2014లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. ఈ నేపథ్యంలో 2022, జూలై 1న ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా అప్పటి సీఎం కేసీఆర్ ఆయనను నియమించారు. 2023 నవంబర్ 17న బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే నాగర్‌కర్నూల్ టికెట్ దక్కకపోవడంతో బీఎస్పీ తీర్థం పుచ్చుకున్నారు.
ఇవి కూడా చదవండి..
Errolla Srinivas | నాపై అక్రమ కేసులు పెట్టిన ప్రభుత్వంపై ధర్మం గెలిచింది : ఎర్రోళ్ల శ్రీనివాస్
Stealth Fighter Jet: 6వ జనరేషన్ స్టీల్త్ యుద్ధ విమానాన్ని పరీక్షించిన చైనా.. వీడియో
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

