న్యూఢిల్లీ: చైనాలో అమ్ములపొదిలోకి సరికొత్త ఆయుధం వచ్చేసింది. 6వ జనరేషన్ స్టీల్త్ యుద్ధ విమానాన్ని(Stealth Fighter Jet) ఇవాళ ఆ దేశం పరీక్షించినట్లు తెలుస్తోంది. ఆ ఫైటర్ జెట్‌కు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. 6వ జనరేషన్ స్టీల్త్ యుద్ధ విమానం నమోనా చాలా అత్యాధునికంగా ఉన్నది. ఆ యుద్ధ విమానానికి తోకభాగం ఎక్కువగా లేదు. దీంతో దాన్ని రేడార్లు పసికట్టడం కష్టంగా ఉన్నట్లు భావిస్తున్నారు. భారత సరిహద్దుల్లో ఒకవేళ ఈ ఫైటర్ జెట్ ఉంటే, అప్పుడు అవి ప్రమాదంగా మారే అవకాశం ఉన్నది. ఎందుకంటే భారత్ వద్ద స్టీల్త్ ఫైటర్ జెట్లు లేవు.
China’s 6th-generation stealth fighter jet made its first test flight today, accompanied by a J-20 fighter pic.twitter.com/DsxH3rHaXe
— Indo-Pacific News – Geo-Politics & Defense (@IndoPac_Info) December 26, 2024