Harish Rao | తెలంగాణ పదమే ఉచ్ఛరించలేదు.. కేంద్ర బడ్జెట్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | ఇవాళ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను చూస్తే బాధ కలుగుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పదమే ఉచ్ఛరించలేదు.. ఆంధ్రప్రదేశ్ పేరును అనేకసార్లు ఉచ్ఛరించారు అని హరీశ్‌రావు గుర్తు చేశారు.
Harish Rao | హైదరాబాద్ : ఇవాళ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను చూస్తే బాధ కలుగుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పదమే ఉచ్ఛరించలేదు.. ఆంధ్రప్రదేశ్ పేరును అనేకసార్లు ఉచ్ఛరించారు అని హరీశ్‌రావు గుర్తు చేశారు. తెలంగాణ అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో కలిసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ఏపీ రాజధానికి డబ్బులు ఇస్తమన్నరు. రాయలసీమతో పాటు ఆంధ్రాలోని వెనుకబడిన జిల్లాలకు డబ్బులు ఇస్తమన్నరు. ప్రత్యేకంగా ఈ విషయాలను ప్రస్తావించడం సంతోషమే కానీ తెలంగాణ విషయం ఏమైంది. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది. కేంద్రంతో సత్సంబంధాలు మెయింటెన్ చేస్తున్నాం. మోదీకి దగ్గరగా ఉన్నాం.. కేంద్ర మంత్రులను రోజు కలుస్తున్నామని చెప్పారు. కనీసం తెలంగాణ ప్రస్తావన కూడా లేదు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి తెలంగాణకు అన్యాయం చేశారని హరీశ్‌రావు ఆగ్రహం వెలిబుచ్చారు.
తెలంగాణలో కూడా వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి. విభజన ట్టం ప్రకారం తెలంగాణలో 9 జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు చొరవ చూపడం లేదు. తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు ఎందుకు మొండి చేయి చూపుతున్నారు. తెలంగాణ ప్రజలంటే కేంద్రానికి, బీజేపీకి ఎందుకింత నిర్లక్ష్యం. పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వొచ్చు కదా..? జాతీయ ప్రాజెక్టు ఊసేలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ప్రస్తావన లేనే లేదు. తెలంగాణకు మొత్తానికి గుండు సున్నా ఇచ్చారు. తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం తీరని అన్యాయం చేయడం జరిగింది. తెలంగాణ నుంచి ఎన్నికైన 8 మంది బీజేపీ ఎంపీలు.. తెలంగాణకు నిధుల్లో వాటా తేవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
Telangana Assembly | ఈ నెల 31 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..
KTR | కేంద్ర బడ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరం : కేటీఆర్
Vinod Kumar | మరోసారి కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మోసం : వినోద్ కుమార్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burglars loot jewellery showroom | నిన్న ఖజాన, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

