Harish Rao | హైదరాబాద్ : గ్రూప్-1 పరీక్షను తిరిగి నిర్వహించాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలనే డిమాండ్‌తో చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ, ఇతర ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్వి నాయకులు, పార్టీ కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
అరెస్ట్ చేసి ముషీరాబాద్, అబిడ్స్, జేఎన్టీయూ పోలీస్ స్టేషన్లకు తరలించిన నాయకులను, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం అని హరీశ్‌రావు పేర్కొన్నారు. సక్రమంగా పరీక్షలను నిర్వహించడం చేతగాని కాంగ్రెస్ సర్కారు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నది. డైవర్షన్ పాలిటిక్స్ చేసినంత మాత్రాన గ్రూప్-1 అవినీతి మరకలు, అవకతవకలు మరుగున పడవు. గ్రూప్ 1 అవకతవకలపై వెంటనే సమగ్ర దర్యాప్తు చేపట్టాలని, ఎన్నికల సమయంలో విద్యార్థులు, నిరుద్యోగులను రెచ్చగొట్టిన రేవంత్ రెడ్డి తన అసమర్థను ఒప్పుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం అని హరీశ్‌రావు అన్నారు.