Harish Rao | హైదరాబాద్ : బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి జయంతి సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఘన నివాళులర్పించారు. తెలంగాణపై వివక్షను ఆనాడే ఎదిరించి గోలకొండ పత్రిక ద్వారా తెలంగాణ సాహితీ ఆత్మగౌరవాన్ని చాటారని కొనియాడారు.
తెలంగాణ గర్వించదగిన గొప్ప వ్యక్తి. తెలంగాణ పోరాటంలో సురవరం స్పూర్తి ఇమిడి ఉంది. భవిష్యత్ తరాలకు వారి చరిత్ర తెలిసేలా వారి జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సీఎంగా కేసీఆర్ నిర్ణయించారు. సురవరం సేవలకు గుర్తుగా ఆయన పేరుతో పలు రంగాలకు చెందిన ప్రముఖులకు గౌరవ పురస్కారాలను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అందించారు అని హరీశ్‌రావు గుర్తు చేశారు.