హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): సామాన్యుల జేబులను ఖాళీ చేసేలా.. టీజీఎస్ఆర్టీసీ టికెట్ ధరలను పెంచిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బతుకమ్మ, దస రా పండుగ సమయంలో సొంతూళ్లకు వెళ్లిన ప్రయాణికుల నుంచి ముకుపిండి చార్జీలు వసూలు చేయడం దుర్మార్గమని ఆయన ధ్వజమెత్తారు.
టికెట్ ధర రూ.140తో జేబీఎస్ నుంచి సిద్దిపేటకు వచ్చిన ప్రయాణికుడు తిరుగు ప్రయాణంలో టికెట్ ధర రూ. 200 చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని హరీశ్‌రావు పేరొన్నారు. హనుమకొం డ నుంచి హైదరాబాద్ సూపర్‌లగ్జరీ బ స్సు ప్రయాణం సాధారణ రోజుల్లో రూ. 300 ఉంటే.. పండుగ వేళ రూ.420కి పెంచారని మండిపడ్డారు. ‘బస్సుల సంఖ్య పెంచకుండా, టికెట్ చార్జీలు పెం చి ప్రజలకు పండుగ సంతోషాన్ని లేకుం డా చేయడమే ప్రజా పాలనా ముఖ్యమంత్రి గారు..?’ అని ప్రశ్నించారు.
ధరలు పెంచలేదు..: వీసీ సజ్జనార్
పండుగ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ విపరీతంగా టికెట్ ధరలు పెంచిందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవంలేదని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. స్పెషల్ బస్సుల్లో మాత్రమే చార్జీలను సంస్థ సవరించినట్టు ఆయన ఎక్స్ ద్వారా వెల్లడించారు. స్పెషల్ బ స్సులకు కనీస డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధరను సవరించుకోవాలని 2003లో జీవో నంబర్ 16 ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిందని గుర్తుచేశారు.