Home
Telangana
Everyone Should Make Exercise A Part Of Their Daily Routine Says Dr Gs Rao Md Yashoda Hospitals
వ్యాయామం దినచర్యలో భాగం కావాలి
ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని దినచర్యలో భాగం చేసుకోవాలని యశోద హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ జీఎస్ రావు చెప్పారు.
- యశోద హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ జీఎస్ రావు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని దినచర్యలో భాగం చేసుకోవాలని యశోద హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ జీఎస్ రావు చెప్పారు. వరల్డ్ హెల్త్ డేను పురస్కరించుకుని హైటెక్ సిటీలోని యశోద దవాఖాన ఆధ్వర్యంలో సోమవారం ‘రన్ ఫర్ హెల్త్’ పేరుతో 5కె రన్ నిర్వహించారు. దవాఖాన నుంచి ఐకియా వరకు నిర్వహించిన ఈ మెగా రన్‌ను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అధ్యక్షుడు రాజన్నతో కలిసి జీఎస్ రావు ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ అనారోగ్యకరమైన జీవనశైలిని దూరం చేయడమే పరుగు లక్ష్యమని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్యదినం సందర్భంగా ‘నా ఆరోగ్యం-నా హక్కు’ అనే నినాదాన్నే ఈ సంవత్సర థీమ్‌గా నిర్ణయించినట్టు తెలిపారు. కార్యక్రమంలో 5,000 మందికిపైగా టీసీఎస్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, యశోద వైద్యలు, నర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

