దేశంలో అందరికీ సమానహక్కులు..సమాన గౌరవం రావాలి : మంత్రి నిరంజన్ రెడ్డి
పాశ్యాత్య దేశాల్లో ఉన్నట్లు అందరికీ సమానహక్కులు, సమాన గౌరవం మన దేశంలోనూ రావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
వనపర్తి : పాశ్యాత్య దేశాల్లో ఉన్నట్లు అందరికీ సమానహక్కులు, సమాన గౌరవం మన దేశంలోనూ రావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఖిల్లాఘణపురం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా నిర్వహించిన జాతీయ గణిత దినోత్సవం గణిత సంబరాలకు హాజరయ్యారు.
మంత్రి మాట్లాడుతూ ‘ సమాజంలో సులభంగా పనిచేసి సంపాదించే వారి పెత్తనం పెరిగింది . అది పోయి కష్టంచేసి సంపాదించే వారి మాట చెల్లుబాటుకావాలి. ఆ పరిస్థితి రావాలి. శ్రమను సమానంగా గౌరవించే పరిస్థితి లేకపోవడంతో పాటు, లింగభేదాలతో మహిళలను చిన్నచూపు చూసే దుస్థితి ఉండడం దురదృష్టకరం’ మని పేర్కొన్నారు. అందరూ పనిచేయడాన్ని గౌరవంగా భావించాలని సూచించారు. దానిని ఇప్పటి నుంచే అందరూ అలవాటు చేసుకోవాలని,పని విలువ తెలిసినప్పుడే మనుషుల విలువ తెలుస్తుందని సూచించారు.
ప్రతి విద్యార్థి రోజు వారి ఇంటిపనులే కాకుండా వారంతంలో ఇతర పనులు చేయాలని వెల్లడించారు. కష్టం చేయడం ద్వారా సాధించిన ఆదాయం ఎంతో సంతృప్తినిస్తుందని అన్నారు.గతంలో ఆడబిడ్డలను ఉన్నత చదువులకు దూరంగా ఉంచేదని నేడు సమాజంలో ఆడబిడ్డలకు ప్రాతినిధ్యం పెరిగిందని తెలిపారు.ఇతర గ్రామాల నుంచి చదువుకోవడానికి వస్తున్న ఘణపురం ఉన్నత పాఠశాల బాలికలకు సైకిళ్లు అందిస్తానని మంత్రి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

