Congress | కాంగ్రెస్ సర్కారుపై అసహనం.. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత
రాష్ట్రంలో వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై అన్ని వర్గాల ప్రజల్లోనూ అసహనం వ్యక్తమవుతున్నది. ఆదరాబాదరాగా నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం.. ప్రజల నుంచి వ్యతిరేకత రాగానే వెనక్కి తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికితోడు ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరించడంపైనా ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.
- అడుగడుగునా అనుభవ రాహిత్యం
- కీలక నిర్ణయాల్లో ప్రభుత్వం తడబాటు
- సొంత పార్టీ నేతల్లోనూ నైరాశ్యం
Congress | హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై అన్ని వర్గాల ప్రజల్లోనూ అసహనం వ్యక్తమవుతున్నది. ఆదరాబాదరాగా నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం.. ప్రజల నుంచి వ్యతిరేకత రాగానే వెనక్కి తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికితోడు ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరించడంపైనా ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సహా పలువురికి పాలనా అనుభవం లేకపోవడం, కీలక నిర్ణయాల్లో సైతం తడబాటు వంటివి కాంగ్రెస్ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయని స్వయంగా పార్టీలోనే చర్చించుకుంటున్నారు.
ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి రుణమాఫీ వరకు పథకాల అమలులో సీఎం రేవంత్ అనుసరించిన తీరు కూడా విమర్శలకు కారణం అవుతున్నది. ఇటీవల ఒక సామాజిక వర్గంపై రేవంత్ అంతులేని ప్రశంసలు కురిపించడంపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తెలంగాణ సంస్కృతిని అవహేళన చేస్తూ ఒక సామాజికవర్గాన్ని కీర్తించటం తమకే నచ్చలేదని కాంగ్రెస్ నేతలే విమర్శిస్తున్నారు. శాఖల మధ్య, మంత్రులు, అధికారులకు మధ్య కొరవడిన సమన్వయ లోపంతో సాధారణ ప్రజానీకం ఇబ్బందులకు గురవుతున్నది.
ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దటంతోపాటు పదేండ్లపాటు కేసీఆర్ తెలంగాణ ప్రతిష్ఠను పెంచటమే కాకుండా అన్ని వర్గాలకు ఆమోదయోగ్యుడైన పాలకుడిగా పేరు తెచ్చుకున్నారని, ఈ క్రమంలో కేసీఆర్ మార్క్‌ను పాలనలో చూపాలంటే అంతకన్నా ఎక్కువ పరిణితితో వ్యవహరించాల్సిందిపోయి పేలవంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం నెలకొన్నది. ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో సీఎం, మంత్రులు, ఆయా శాఖల అధికారుల మధ్య లోపించిన సమన్వయమే అందుకు నిదర్శమని చెప్తున్నారు. సీఎంకు పాలనా పరమైన అనుభరాహిత్యం ఉన్నదనే విషయాన్ని గ్రహించిన అధికారులు క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులకు భిన్నమైన విషయాలను ప్రభుత్వానికి నివేదించటం వల్లే ఇటీవల తాము తీసుకున్న నిర్ణయాలు బెడసికొడుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పటిష్ట కసరత్తు చేయకుండా ఆగమేఘాలపై రైతురుణమాఫీని రూ. 2 లక్షలకు బదులు రూ. లక్షతో ప్రారంభించటం రైతాంగంలో తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. గ్రూప్ 2 పరీక్షను ఉద్యోగార్థులు కోరగానే వాయిదా వేస్తేపోయేదని, తరువాత వేసినా ఫలితం లేకుండాపోయిందని అంటున్నారు. రుణమాఫీకి రేషన్‌కార్డు నిబంధన, సంక్షేమ పథకాల విషయంలో సర్వే చేస్తున్నామని ప్రకటించి తీరా విమర్శలు వెల్లువెత్తడంతో ఆపేయాలని ఉత్తర్వులు ఇవ్వడం వంటి అనేక అంశాల్లో ప్రభుత్వం తొలుత నిర్ణయం తీసుకుని తర్వాత వాయిదా వేయడమో, రద్దు చేయడమో చేస్తున్నారు. దీంతో ప్రజలు కేసీఆర్ పాలనను గుర్తుచేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని అనుకోలేదని వాపోతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

