నిధులు తెస్తరా? రాజీనామా చేస్తరా?
తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి కూడా బడ్జెట్లో రూపాయి తెప్పించలేకపోయారని, అలాంటి వారికి పదవులున్నా, లేకున్నా ఒక్కటేనని వక్తలు ఆగ్రహం వ్యక్తంచేశారు.
- ఎనిమిది ఎంపీ సీట్లు ఇచ్చినా బీజేపీకి కృతజ్ఞత లేదా?
- ఏపీ, బీహార్‌కే కాదు అన్ని రాష్ర్టాలకు నిధులివ్వాలి
- రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తల ఆగ్రహం
ఖైరతాబాద్, జూలై 25: తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి కూడా బడ్జెట్లో రూపాయి తెప్పించలేకపోయారని, అలాంటి వారికి పదవులున్నా, లేకున్నా ఒక్కటేనని వక్తలు ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ప్రధాని, ఆర్థిక, హోంశాఖ మంత్రులను కలిసి వారం పదిరోజుల్లో బడ్జెట్లో కేటాయింపులు చేయించాలని, ఒకవేళ ఒప్పించలేకపోతే పదవులకు రాజీనామా చేయడం ఉత్తమం అని సూచించారు.
ఇద్దరు కేంద్రమంత్రులతో మిగిలిన ఆరుగురు బీజేపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సెక్యులర్ డెమోక్రటిక్ ఫోరం తెలంగాణ ఆధ్వర్యంలో జరిగిన రౌం టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రిటైర్డ్ జస్టిస్ బీ చంద్రకుమార్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగ విలువలకు భిన్నంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. బడ్జెట్ అనేది రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్, బీహార్‌కే కాదు దేశంలోని అన్ని రాష్ర్టాలకు సమానంగా, అవసరాలకు అనుగుణంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాజకీయ అధికారం నిలబెట్టుకోవడం కోసం, కొన్ని పార్టీలను తృప్తి పర్చడం కోసం బడ్జెట్లో కేటాయింపులు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. తమ ప్రభుత్వానికి మద్దతిచ్చిన పార్టీలకే ఎక్కువ చేస్తామంటే, చేయక తప్పదంటే తమ పదవులకు రాజీనామా చేసి మరోసారి ఎన్నికలకు పోవాలని సవాల్ చేశారు.
1956 నుంచి తెలంగాణకు అన్యాయం జరుగుతూనే ఉన్నదని, నీళ్లు, నిధులు, ఉద్యోగాల విషయంలో తీరని అన్యాయం జరిగిందని వివరించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీరని కలగానే మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణకు బడ్జెట్లో కేటాయింపులు ఇవ్వకుండా వివక్ష చూపారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు 8 పార్లమెంట్ సీట్లు ఇచ్చినా బీజేపీకి కృతజ్ఞత లేదా? అని ప్రశ్నించారు. సమావేశంలో ఓట్నీడ్ గ్యారెంటీ అధ్యక్షురాలు సొగరా బేగం, నాగరాజు, గోవర్ధన్, నర్సింహ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

