హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో లేకున్నా ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ద్వారా బేసిన్ అవతలికి పెద్దమొత్తంలో నీటిని తరలిస్తున్నదని తెలంగాణ సర్కారు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఏడాది తాగు, సాగు అవసరాలకు నీరు విడుదల చేసేందుకు కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి ఆధ్వర్యంలో సోమవారం జలసౌధలో త్రిసభ్య కమిటీ సమావేశమైంది. సమావేశం వాయిదా వేయాల ని రాష్ట్ర ఈఎన్సీ మురళీధర్ కోరారు. అయినా, రాష్ట్ర తాగు, సాగునీటి అవసరాల ఇండెంట్‌ను బోర్డుకు ప్రతిపాదించారు. జలాశయాల్లో నీటి ఎద్దడి నెలకొన్నదని తెలిపారు. అయినప్పటికీ ఈ నెల 16 నాటికే పోతిరెడ్డిపాడు ద్వారా 7.4 టీఎంసీల ను తరలించుకుపోయిందని తెలిపారు. తెలంగాణ తాగునీటి అవసరాలకు వచ్చే మే నాటికి కల్వకుర్తికి, హైదరాబాద్‌కు, ఎడమ కాలువకు కలిపి మొత్తం 26.95 టీఎంసీలు కేటాయించాలని కోరారు.