హైదరాబాద్: ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షం (Rain) కురిసింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఫిల్మ్‌నగర్, యూసఫ్‌గూడ, ఖైరతాబాద్, కోఠి, సుల్తాన్‌బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, లక్డీకపూల్, లిబర్టీ, హిమాయత్‌నగర్, నారాయణగూడ, లోయర్ ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్, కుత్బుల్లాపూర్, చింతల్ సాయినగర్, మల్కాజిగిరి, ముషీరాబాద్, సికింద్రాబాద్ వెస్ట్‌మారేడ్‌పల్లి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రహదారులపై నీరు నిలవడంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు.
ఇక వికారాబాద్ జిల్లాలోని ధరూర్ మండలంలో భారీ వర్షం కురిసింది. దీంతో నాగసముద్రం, కోట్‌పల్లి గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. గొట్టిముక్కల, ద్యాచారం, నాగారం గ్రామాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. సంగారెడ్డి పట్టణంతోపాటు జిల్లాలోని జహీరాబాద్, జిన్నారం, కోహిర్ మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, దోమకొండ, బిక్కనూరు, మాచారెడ్డి, రాజంపేట మండలాల్లో తేలికపాటి వర్షం పడింది. ములుగు జిల్లాలోని లింగంపేట, తాడ్వాయి మండలాల్లో, మెదక్ జిల్లాలోని కొల్చారం, చిన్న శంకరంపేట, టేక్మల్‌లో భారీ వర్షం కురిసింది.
కాగా, ములుగు జిల్లా ఏటూరు నాగారంలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా లింగాలలో 10సెం.మీ., మొగడంపల్లి (సంగారెడ్డి)లో 9.8 సెం.మీ., పల్లెగూడెం (ఖమ్మం)లో 8.98 సెం.మీ., మేడారం (ములుగు)లో 8.43 సెం.మీ., పుల్కల్ (సంగారెడ్డి)లో 7.45 సెం.మీ., గూడూర్ (జనగామ)లో 7.38 సెం.మీ., వికారాబాద్ జిల్లా ఖాసింపూర్, బషీరాబాద్‌లో 7 సెం.మీ., పెరుమాండ్ల-సంకీస (మహబూబాబాద్)లో 7 సెం.మీ., కొండాపూర్ (సంగారెడ్డి)లో 6.48 సెం.మీ., మోమిన్‌పేట్ (వికారాబాద్)లో 6.35 సెం.మీ. వర్షపాతం, కూనారం (పెద్దపల్లి)లో 6.18 సెం.మీ., కాసిందేవిపేట (ములుగు)లో 8.78 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది.