రక్తచరిత్ర ఈటలదే
హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ది రక్తచరిత్ర అని, రాజకీయాల కోసం నియోజకవర్గంలో అనేకమందిని హత్య చేయించారని ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన జీవితమంతా హత్యా రాజకీయాలేనని..
- ఆయన జీవితమంతా హత్యా రాజకీయాలే..
- తప్పని నిరూపిస్తే ముక్కు నేలకురాస్త
- ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి సవాల్
హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ది రక్తచరిత్ర అని, రాజకీయాల కోసం నియోజకవర్గంలో అనేకమందిని హత్య చేయించారని ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన జీవితమంతా హత్యా రాజకీయాలేనని.. ఆరోపణలు తప్పయితే ముక్కు నేలకు రాయడానికి సిద్ధమని సవాల్ విసిరారు. బుధవారం టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో కౌశిక్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు.
గోతులు తవ్వే అలవాటు ఉన్న ఈటల నీతులు చెబుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదని, ఆయన రక్తచరిత్రను కేసీఆర్‌కు అంటించాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ఈటలది రక్తచరిత్ర కనుకే అందరినీ అదే కోణంలో చూస్తారని.. ఆయన పైకి కనిపించేంత అమాయకుడు కాదని, చెప్పేదొకటి చేసేది మరోటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు ఈటలకు నకకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నదని, అన్నం పెట్టిన కేసీఆర్‌కు సున్నం పెట్టిన ఘనచరిత్ర ఆయనదని విమర్శించారు.
హుజూరాబాద్ అభివృద్ధిపై చర్చకు రమ్మంటే పారిపోయిండని, ఉపఎన్నికల్లో గెలిచి ఏడాదవుతున్నా నియోజకవర్గానికి లక్ష రూపాయలైనా తీసుకురాలేదని వివరించారు. గన్‌లైసెన్స్‌లు యథేచ్ఛగా ఇస్తున్నారన్న ఈటల వ్యాఖ్యలు అవాస్తవమని చెప్పారు. సానుభూతి రాజకీయాలు చేయడం ఈటలకు అలవాటేనని, ఆయన్ను ఎవరూ పట్టించుకోవడం లేదని స్పష్టం చేశారు. శాసనసభ నుంచి కావాలనే సస్పెండ్ అయ్యారని.. ఆయనకన్నా ముందే మా నాన్న కేసీఆర్‌తో కలిసి పనిచేశారని కౌశిక్‌రెడ్డి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

