తెలంగాణ ఉద్యమకారుడైనా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శీనన్నను భారీ మెజార్టీతో గెలిపించాలి. ఈటల రాజేందర్ తెల్ల బట్టలు ధరించిన వ్యక్తులనే దగ్గరకు రానిస్తడు. మన లాంటి సామాన్య కార్యకర్తలను దగ్గరకు రానివ్వడు. కేసీఆర్ వెంటే మేముంటాం. కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి చేస్తున్నారు. ఉచిత కరెంట్, దళిత బంధు, రైతు బంధు లాంటి అద్భుతమైన పథకాలను కేసీఆర్ అమలు చేస్తున్నారు. – మాదిరెడ్డి రామ్మోహన్ రెడ్డి ( తనుగుల గ్రామం, జమ్మికుంట మండలం )
కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు చాలా బాగున్నయ్. రైతు బంధు, దళిత బంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి పథకాలు అద్భుతం. సకాలంలో కాళేశ్వరం నుంచి నీళ్లు వస్తున్నాయి. పొలాలన్నీ పండుతున్నాయి. ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా ఉన్న, మంత్రిగా ఉన్న చేసిందేమీ లేదు. కేసీఆర్ సార్కు ఈటల అన్యాయమే చేసిండు. కేసీఆర్ సార్ డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తే ఈటల రాజేందర్ కట్టించలేదు. కేసీఆర్ సార్కే మా ఓటు. జై కేసీఆర్.. జై తెలంగాణ. – సమీడ్ల సురేందర్ ( తనుగుల గ్రామం, జమ్మికుంట మండలం )