Etala Rajender | హైదరాబాద్ : రేవంత్ రెడ్డి నీకు నిజంగా దమ్ముంటే మల్కాజిగిరి ప్రాంతం వాడినే ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టు, బయటివాడిని నిలబెడితే నీ సంగతి చెప్తా అని ఈటల రాజేందర్ హెచ్చరించారు.
మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. మల్కాజ్‌గిరితో ఈటలకు ఏం సంబంధం అని రేవంత్ అంటుండు. మరి నీకేం సంబంధం రేవంత్. ఒక ఛాలెంజ్ వేస్తున్నా.. నీకు దమ్ముంటే ఈ ప్రాంతం వాడిని మల్కాజ్‌గిరిలో పోటీ చేయించు. ఈ ప్రాంతంతో సంబంధం ఏంటని అంటున్నావు కదా.. నీకు నిజంగా దమ్ముంటే ఈ ప్రాంతం నుంచి ఒక ఎంపీ అభ్యర్థిని నిలబెట్టు. బయటి వ్యక్తిని నిలబెడితే నీ సంగతి చెప్తాం. రేవంత్‌కు దమ్ము లేదు. అభ్యర్థి కోసం వెతుకుతుండు. రూ. 200 కోట్లు ఖర్చు పెట్టేటోడు కావాలట. ఈటల రాజేందర్‌ను తట్టుకోవాలంటే రూ. 400 కోట్లు ఖర్చు పెట్టేతోడు కావాలి అని ఈటల పేర్కొన్నారు.