వెంటనే కొత్త డిస్పెన్సరీల ఏర్పాటు
- అన్ని వసతులతో కూడిన భవనాలను గుర్తించండి
- ఈఎస్ఐసీలో మహిళలకు,దివ్యాంగులకు ప్రత్యేక వసతులు
- కార్మిక మంత్రి మల్లారెడ్డి ఆదేశం
హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): కొత్తగా డిస్పెన్సరీలను వెంటనే ఏర్పాటు చేయాలని, అందుకు అన్ని వసతులతో కూడిన భవనాలను గుర్తించాలని సంబంధిత అధికారులను కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఆదేశించారు. ఈఎస్ఐసీ రీజినల్ బోర్డు మీటింగ్ మంత్రి మల్లారెడ్డి అధ్యక్షతన బుధవారం కొనసాగింది. ఈ సందర్భంగా ఈఎస్ఐసీ వసతులు తదితర అంశాలపై మంత్రి చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డిస్పెన్సరీల్లో అన్ని వసతులు కల్పించాలని, పరిశుభ్రత పాటించాలని అధికారులకు సూచించారు. ఈఎస్ఐసీలో మహిళలకు, దివ్యాంగులకు ప్రత్యేక వసతులు కల్పించాలని దిశానిర్దేశం చేశారు.
కొత్తగా ఏర్పాటు చేయబోయే 15 డిస్పెన్సరీలకు అనువైన భవనాలను గుర్తించి త్వరితగతిన ప్రారంభించాలని చెప్పారు. ఈఎస్ఐసీ నుంచి రూ.442 కోట్లు రావాల్సి ఉండగా, రూ.228 కోట్లు మాత్రమే కేటాయించటంపై అసహనం వ్యక్తం చేశారు. పూర్తి మొత్తంలో నిధులను రాబట్టేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈఎస్ఐసీలతో అనుసంధానించనున్న పీఐపీ ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేసి అనుమతులు తీసుకోవాలని తెలిపారు. ఉద్యోగులందరికీ బయోమెట్రిక్ హాజరును అమలు చేయాలని, వేతనాల పెంపునకు చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో బోర్డు సభ్యులు రాజమహేందర్, మల్లేశం, ఎస్ మల్లేశం, మారయ్య, రమణారెడ్డి, ఈఎస్ఐసీ డీన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

