హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : 200 ఎకరాల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఏఐ సిటీని నిర్మిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఉగాది తర్వాత మహేశ్వరంలో ఏఐ సిటీ నిర్మాణానికి భూమిపూజ చేసేందుకు ఏర్పాట్లుచేస్తున్నట్టు తెలిపారు. హైటెక్ సిటీలోని ఐటీసీ కోహినూర్‌లో శుక్రవారం క్లియర్ టెల్లిజెన్స్ ఇండియా డెలివరీ అండ్ ఆపరేషన్స్ సెంటర్‌ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు.
భావితరాల అవసరాలకు అనుగుణంగా ఫ్యూచర్ సిటీని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు చెప్పారు. ఇప్పటికే సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రాలను ప్రారంభించామని, త్వరలోనే క్వాంటం కంప్యూటింగ్‌లోనూ ఏర్పాటుచేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.