హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : ఈసెట్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలయ్యింది. మొదటి విడతలో ఈ నెల 14 నుంచి 18 వరకు దరఖాస్తులు, 19 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, 21 వరకు వెబ్ ఆప్షన్లు, 25న సీట్ల కేటాయింపు, 29 వరకు ఆన్లైన్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
తుది విడతలో జూలై 11 నుంచి 13వరకు దరఖాస్తులు, 14న సర్టిఫికెట్ వెరిఫికేషన్, 15 వరకు వెబ్ ఆప్షన్లు, 18న సీట్ల కేటాయింపు, 20 వరకు ఆన్లైన్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. సీట్లు పొందిన వారు జూలై 22 వరకు కాలేజీల్లో రిపోర్ట్చేయాలి. 23లోగా జాయినింగ్ కావాల్సి ఉంటుంది. జూలై 22న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు, 29లోపు స్పాట్ పూర్తిచేయాల్సి ఉంటుంది.