హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌కు తెలంగాణ చరిత్ర తెలియదని, నదీ జలాలపై అవగాహన లేదని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మెప్పుకోసం కేసీఆర్, హరీశ్‌రావును ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ చరిత్రను తప్పుదోవ పట్టించాలని చూస్తే ఊరుకోబోమని, ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని శుక్రవారం ఎక్స్ వేదికగా హెచ్చరించారు. 2016లో సీడబ్ల్యూసీ మీటింగ్‌లో కేసీఆర్ మాట్లాడిన అంశాలను హరీశ్‌రావు మొన్న సోదాహరణంగా వివరించారని, ఇవేమీ అర్థం కాని చామల అడ్డదిడ్డంగా మా ట్లాడుతున్నారని మండిపడ్డారు.
బనకచర్లపై ఢిల్లీకి వెళ్లిన రేవంత్‌రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుతో లోపాయికారి ఒప్పందం చేసుకొని గోదావరి నీళ్లను తరలించుకుపోయేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని ఆరోపించారు. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టుపెట్టి సీమాం ధ్ర నాయకత్వానికి ఊడిగం చేస్తున్నది మీ ముఖ్యమంత్రేనని మండిపడ్డారు. హరీశ్‌రావు ప్రెస్‌మీట్ పెట్టి ముళ్లకర్రతో పొడుస్తేగాని సోయిలేకుండా మొద్దు నిద్ర నటించింది మీ ప్రభు త్వం కాదా? అని నిలదీశారు. బేసిక్స్, ఎథిక్స్ గురించి కాం గ్రెస్ నాయకులు మాట్లాడుతుంటే ద య్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నదని ఎద్దేవా చేశారు. అఖిలపక్షాన్ని సీ ఎం రేవంత్ రాజకీయ వేదికగా మా ర్చుకొంటే బీఆర్ఎస్ ఎంపీ వాకౌట్ చేయకుండా ఇంకేం చేస్తారని ప్రశ్నించారు.