హైదరాబాద్ : ఉమ్మడి వరంగల్ జిల్లాకు మరో రాష్ట్రస్థాయి పదవి దక్కింది. ప్రముఖ నృత్య కళాకారిణి దీపికారెడ్డి రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్‌గా ప్రభుత్వం నియమించింది. ఆమె నియామకంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రగతి భవన్లో మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, చేవెళ్ల లోక్‌సభ సభ్యులు రంజిత్ రెడ్డి, చైర్‌పర్సన్‌గా దీపికారెడ్డి సీఎం కేసీఆర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్‌గా తనను నియమించినందుకు దీపికారెడ్డి సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.