Errabelli Dayakar Rao : హైదరాబాద్ ఏడాది పాటు వ్యవసాయంలో సాయపడిన పశువులు, ప్రకృతిని పూజించే గొప్ప పండుగ కనుమ అని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కనుమ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పూలు, పశువులు, ప్రకృతిని పూజించడం మనకున్న గొప్ప సంస్కృతి అని, దానిని కాపాడడమే కాకుండా భవిష్యత్ తరాలకు వారసత్వంగా అందించాలని ఎర్రబెల్లి అన్నారు.
తెలంగాణ సంస్కృతి, ఆచార, వ్యవహారాలు, చరిత్రను పరిరక్షించేందుకు ప్రభుత్వం గొప్ప కృషి చేస్తోంది అని ఆయన వెల్లడించారు. భారత దేశ రైతన్నలు ఈ సంక్రాంతి, కనుమ పండుగలను సుఖసంతోషాలతో చేసుకునేందుకు కేసిఆర్ భారత రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు చేశారని, ఈ పార్టీ విజయానికి అందరూ సహకరించాలని మంత్రి కోరారు.